
* పది నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత
* ఎమ్మెల్సీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి..
* ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే శాసనమండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) తెలిపారు. ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ (Bjp) పోటీ చేస్తోందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. శాసనమండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని చెప్పారు. కిషన్‌రెడ్డి వెంట ఎంపీ రఘునందన్ రావు (Raghunandan rao)కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ తప్ప.. మిగతా ఏ పార్టీలూ సమర్ధవంతంగా ఎన్నికల రంగంలో లేవని విమర్శించారు. బీఆర్ ఎస్ (Brs) పదేళ్ల కాలంలో శాసనమండలిని నిర్వీర్యం చేసిందన్నారు. శాసనమండలిలో ఉపాధ్యాయుల గొంతు కాని, నిరుద్యోగుల గొంతు కానీ, ప్రజల గొంతు కానీ వినిపించకుండా నిర్వీర్యం చేసిందన్నారు. తమను గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. శాసనమండలిలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ప్రజల గొంతుకై నిలబడ్డాదని తెలిపారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ (Congress)లు శాసనమండలి ఉందా, లేదా అనే పరిస్థితిని తెచ్చాయన్నారు. శాసనమండలిలో ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలంటే.. మరోసారి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. 27న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని, వారికి అండగా ఉండాలని కిషన్ రెడ్డి కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం అప్పగించాలన్నారు. బీఆర్ ఎస్పై వ్యతిరేకతకు పదేళ్లు పడితే.. కాంగ్రెస్‌పై పది నెలల్లోనే వ్యతిరేకత మొదలైందని చెప్పారు. తెలంగాణ అప్పులకుప్పగా మారిందన్నారు.
…………………………………………..