
ఆకేరు న్యూస్, అమరావతి : ప్రేమికుల రోజు( Valentine Day ) నే ప్రేమించిన అమ్మాయిపై పగ పెంచుకున్నాడు. ఆమెకు వేరొకరితో నిశ్చితార్థం కావడంతో తట్టుకోలేకపోయాడు. ఆమెను కత్తితో పొడిచి యాసిడ్ తో దాడి చేశాడు. ఏపీ అన్నమయ్య జిల్లాలోని (Annamaiah District) గుర్రంకొండ మండలానికి చెందిన యువతిని (23) కొన్నాళ్లుగా గణేష్ అనే యువకుడు ప్రేమిస్తున్నా అని వెంటపడేవాడు. ఆమెకు
ఏప్రిల్ 29న పెళ్లి నిశ్చయమైంది. అప్పటి నుంచీ గౌతిమిపై గణేష్ పగ పెం చుకున్నాడు. వాలెంటైన్స్ డే రోజున యువతిపై గణేష్ కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. నిందితుడు మదనపల్లె అమ్మ చెరువుమిట్టకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu) , హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఖండించారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు.
……………………………………….