
ఆకేరున్యూస్, ఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లేందుకు శనివారం రాత్రి ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన 14, 15 ప్లాట్‌ఫాంలపై జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
………………………………………