
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం భావితరాలకు శాపంగా మారిందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్.. గురుకుల విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు.. ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా.. అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భంధం ప్రయోగిస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగో తెలంగాణ జాగో! అని కేటీఆర్ నినదించారు.
………………………………