
* పాల డబ్బాల స్కూటర్‌పై మాజీ మంత్రి సందడి
ఆకేరున్యూస్, హైదరాబాద్: గతంలో పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.. తాజాగా మళ్ళీ ఆయన పాల బండిపై కనిపించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఓ కార్యక్రమానికి వెళ్లిన మల్లారెడ్డి.. అక్కడ తనకు పాల డబ్బాతో కనిపించిన స్కూటర్‌పై ఎక్కి కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
…………………………….