
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70 ఏళ్లు పూర్తి చేసుకొని నేడు 71 వసంతంలోకి అడుగుట్టారు.. కేసీఆర్ పుట్టినరోజు సదర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే.. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. ఎక్స్‌లో బర్త్‌డే విషెస్ చెబుతూ పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు.. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతూ ప్రజాసేవలో నిమగ్నం కావాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
……………………………….