
* అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు..!
ఆకేరున్యూస్, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన డిజైన్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్‌కార్డుల జారీకి వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల్లో కోడ్ అమలులోకి వచ్చింది. అయితే, కోడ్ అమలులో లేని జిల్లాల్లో రేషన్‌కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేస్తున్నారని.. ఈ క్రమంలో వారంతా మళ్లీ దరఖాస్తులు చేయకుండగా అవగాహన కల్పించాలని సూచించారు.
………………………………….