
* ఆ దిశగా కీలక నిర్ణయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy) సూచించారు. హెచ్ఐసీసీలో షీల్డ్ – 2025 (Shield – 2025) సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ సేఫ్టీలో దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1గా ఉంచాలన్నదే లక్ష్యమన్నారు. మొదటిసారి ఇలాంటి సదస్సును నిర్వహించినందుకు సైబర్ సెక్యూరిటీ వింగ్(Cyber Security wing)ను, సైబరాబాద్ పోలీసులను, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను అభినందించారు. సైబర్ నేరాల్లో (Cyber Crimes) బాధితులు పోగొట్టుకున్న సొమ్ము రికవరీలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉండడం అభినందనీయమన్నారు. సైబర్ నేరాల దర్యాప్తు కోసం గతేడాది 7 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి.. ఇక్కడి మన సొమ్మును దోచుకుంటున్నారు. నేరాల తీరు మారింది. దానికనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు కూడా మారాలని చెప్పారు. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridharbabu) మాట్లాడుతూ సైబర్ నేరాల వల్ల దేశం రూ. 15వేల కోట్లను నష్టపోతోందని చెప్పారు. 14 రాష్ట్రాల నుంచి సైబర్ నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
……………………………….