
* కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి.. అమలు చేయలేక విఫలమైంది.
* పట్టభద్రుల టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమస్యల మీద కొట్లాడే బిజెపి పార్టీని గెలిపించండి
* మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
ఆకేరున్యూస్, కమలాపూర్: రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంకుశం పెడితే తప్ప సమస్యలు పరిష్కారం కావు అని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సాయంత్రం కమలాపూర్ లోని ఈటెల స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి , అమలు చేయలేక విఫలమైందని విమర్శించారు కాబట్టి ఈ నెల 27న జరగబోతున్న కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరుపున అంజి రెడ్డి,కొమురయ్య లను గెలిపించాలని ఆయన కోరారు. యువత, ఉద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పనున్నారని ఈటెల అన్నారు. గత రెండేళ్లుగా కేంద్ర బడ్జెట్లో, నిరుద్యోగ సమస్య మీద నిధులు కేటాయించామని, యువశక్తి దేశ పురోగమనలో అభివృద్ధిలో భాగం పంచుకోకపోతే ఈ దేశం మూడవ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందదనీ బిజెపి ప్రభుత్వం భావిస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. కేజీబీవీ, మోడల్ టీచర్ల స్కూల్ సమస్యల పై బిజెపి తరఫున పోరాటం చేశామని అన్నారు. మోడీ గారి నాయకత్వంలో ఉద్యోగులకి, టీచర్లు కి 12 లక్షల వరకు ఇన్కమ్ టాక్స్ మినహాయింపు చేసింధని గుర్తు చేశారు. ప్రజల కోసం తపన పడే పార్టీ, చట్టాలు చేసే బిజెపి ప్రభుత్వాన్నీ గెలిపించాలని ఆయన కోరారు. బిజెపి కార్యకర్తలు ఎక్కడికక్కడ ఓటర్ల జాబితా పట్టుకొని ఓటర్ల ఇళ్లల్లోకి వెళ్లి గెలిపించుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో ప్రపంచంలోనే దేశ గౌరవం పెంచిన నాయకుడు మోడీ అని, కాబట్టి వేసే ఓటు మోడీ ప్రభుత్వానికి మరింత శక్తినిచ్చే ఓటు అవుతుందని, అంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, నాయకులు కట్కూరి అశోక్ రెడ్డి భూపతి ప్రవీణ్ కుమార్, కొండ శ్రీను, బాబు, రత్నాకర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
………………………………..