
* చత్రపతి శివాజీ విగ్రహాలను ఆవిష్కరించిన
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
ఆకేరున్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. శంభునిపల్లి , నేరెళ్ళ గ్రామాలలోని ఛత్రపతి శివాజీ విగ్రహలను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆవిష్కరణ చేశారు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
బాధితులను ఆదుకుంటాం
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కమలాపూర్ లోని తన స్వగృహంలో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా జెండా ఎత్తుతున్న క్రమంలో విద్యుత్ తీగలకు జెండా తగిలి షాక్ గురై 20 సంవత్సరాల లింగా ప్రశాంత్ అనే విద్యార్థి చనిపోవడం దురదృష్టకరం అని అతని కుటుంబాన్ని ఆదుకుంటామని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఈటల తెలియజేశారు. ఇంకొక కరుణాకర్ అనే విద్యార్థి సీరియస్ గా ఉన్నాడని కోలుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాన్ని ,మెడికల్‌గా ప్రొవైడ్ చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, బండారి సుధాకర్, భూపతి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
………………………..…………………