
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) గురువారం ఉదయమే ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. గచ్చిబౌలి(Gachibowli)లోని ఆస్పత్రిలో సాధారణ పరీక్షలు చేయించుకోనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి నిన్న హైదరాబాద్ లోని తెలంగాణభవన్‌కు కేసీఆర్ విచ్చేశారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ తెలంగాణ భవన్(Telanganabhavan)కు రావడంతో ఆయన ను చూడాలని, ఆయనతో సెల్ఫీ దిగాలనే ఉత్సాహంతో యవకులు తరలివచ్చారు. మ ధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ వస్తారని షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, ఉదయం 10గంటల నుంచే యువకులు గేట్ల వద్ద పడిగాపులు కాశారు. సీఎం.. సీఎం.. అని నినదించారు. బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
…………………………………….