
* సాంకేతిక సమస్య తలెత్తడమే కారణం
* విమానంలో 396 మంది ప్రయాణికులు
ఆకేరు న్యూస్, డెస్క్ : బంగ్లాదేశ్‌కు చెందిన విమానం నాగపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్యల కారణంగానే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేసినట్లు అధికారులు తెలిపారు. బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ (Biman Bangldesh Airlines)కు చెందిన విమానం 396 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఢాకా (Dhaka) నుంచి దుబాయ్‌కి బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్య (technical glitch) తలెత్తింది. దీంతో విమానాన్ని మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur)కు దారి మళ్లించారు. నాగ్‌పూర్ విమానాశ్రయంలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు అంతా సేఫ్‌గానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
………………………………