
* పందులు పట్టడానికి వెళ్లి దుర్మరణం
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : పంటపొలంలో విద్యుత్ షాక్ (Electtic Shock ) తగలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లా పెగడపల్లిలోని పంట పొలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. రేచల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఉర్సు గంగారాం, కుమారుడు కిషన్, భార్య బాలమణి అడవి పందులు (Forst Pigs)పట్టడానికి పంటల పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు విద్యుత్‌తీగలు తగిలి ముగ్గురు మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టమార్టం కోసం బోధన్ ఆస్పత్రి(Bhodan Hospital)కి తరలించారు. ఒకేసారి కుటుంబంలో ముగ్గురి మృతితో తీవ్ర విషాదం నింపింది. పందులు పంటలను నాశనం చేస్తున్నాయని, పంటను కాపాడుకునే ప్రయత్నంలో మృత్యు ఒడికి చేరడం దారుణమని స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………