
* పూజ గదిలో రేవంత్రెడ్డి ఫొటోకు పూజలు చేస్తున్న కుమారి ఆంటీ…
ఆకేరున్యూస్, హైదరాబాద్: కుమారి ఆంటీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. తన ఇంట్లోని పూజ గదిలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టుకున్న ఆమె.. ప్రతి రోజూ దేవుళ్లతో పాటు నిత్యం హారతులిస్తూ రేవంత్ రెడ్డికి కూడా పూజలు చేస్తున్నారు. ఈ రోజు తాను ఫుడ్ స్టాల్ నడిపిస్తున్నానంటే అందుకు కారణం సీఎం అని, ఆయన తనకు దేవుడితో సమానం అని అందుకే పూజలు చేస్తుంటానని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. సీఎంపై ప్రత్యేక అభిమానం హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు సమీపంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ నడుపుతున్నారు. ఆమె ఫుడ్ స్టాల్లో తక్కువ ధరకే ఫుడ్ దొరుకుతుందని, టేస్టీగా ఉంటుందని కొందరు గతంలో సోషల్ మీడియాలో ఆమె వీడియోలో షేర్ చేశారు. ఆ వీడియోలు కాస్త వైరల్ గా మారడంతో కుమారి ఆంటీ సెలబ్రేటీగా మారారు. అయితే, పోలీసులు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ తొలగించేందుకు ప్రయత్నించారు. కానీ, సీఎం రేవంత్ స్పందించి తొలగించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కుమారీ ఆంటీ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకుంది.
…………………………………………………