
* 3 మీటర్ల మేర కూలిన పైకప్పు.. కూలీలకు గాయాలు
ఆకేరు న్యూస్, శ్రీశైలం : దోమలపెంటలో ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC TUNNEL) వద్ద ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద పై కప్పు 3మీటర్ల మేర పడింది. కూలిన పైకప్పు మీద పడడంతో పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించారు. ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. ఆ సొరంగం వద్ద 4రోజుల క్రితమే మళ్లీ పనులు మొదలయ్యాయి. నీటి పారుదల శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం (ACCIDENT) జరిగిన సమయంలో టన్నెల్ లోపల ఐదారు మంది కూలీలు ఉన్నట్టు సమాచారం ఉంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. ఒక్కసారి కుప్ప కూలడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. మూడు మీటర్లు మేరకు పై కప్పు కుంగడంతో అధికారులు అందుకు తగినట్లుగా చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.
………………………………….