
ఆకేరు న్యూస్, జోగులాంబ గద్వాల జిల్లా : జిల్లాలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పొట్లాట (Sheep Fighting) పోటీలు ఆకట్టుకున్నాయి. వాటిని వీక్షించేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. సై అంటే సై అంటూ ఒకదాన్నికొకటి ఢీకొట్టుకుంటున్న పొట్టేళ్ల పొట్లాట పోటీ రసవత్తరంగా సాగింది. పోటీలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో భాగంగా పొట్టేళ్ల పొట్లాట పోటీలను నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నడిగడ్డలోని అయిజ తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పొట్టేళ్ల పోరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పోటీలకు తెలంగాణ(Telangana), ఏపీ(Ap), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల నుంచి 20 పొట్టేళ్లు తరలొచ్చాయి. విజేతలకు ఆలయ నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు. మొదటి బహుమతి జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన డల్ల నర్సింహులు (సుల్తాన్) పొందారు. ఆయనకు రూ.50, 016లు అందజేశారు. రెండో బహుమతి హైదరాబాద్కు చెందిన రాజవల్లి కిల్లర్ గ్రూప్ (రూ.35,016) మూడో బహుమతి హైదరాబాద్కు చెందిన ఎంజే గ్రూప్ (రూ.20,016) నాల్గో బహుమతి హైదరాబాద్కు చెందిన క్రైమ్మేకర్స్ ప్రూప్ (మచ్చ)- 375) (రూ. 10,016) పొట్టేళ్లు కైవసం చేసుకున్నాయి.
…………………………………………..