
* రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ఆకేరున్యూస్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మా సవాల్‌ను స్వీకరించాలన్నారు. నాలుగు కోట్ల ప్రజల ముందు.. అసెంబ్లీ సమావేశాల్లోనే నీ బట్టలు విప్పుతాం.. మేం చెప్పినవి తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఆరు గ్యారెంటీలు అమలు చేసిన దగ్గరే పోటీ చేయాలి అనవచ్చు. పూర్తిస్థాయి రుణమాఫీ అయిన దగ్గర.. రైతుబంధు వచ్చిన దగ్గర ఆడబిడ్డలకు 2500 వచ్చిన దగ్గర పెంచిన పెన్షన్లు ఇస్తున్న దగ్గర మాత్రమే కాంగ్రెస్ పోటీ చేయాలి. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్న దగ్గర ముఖ్యమంత్రి ఓట్లు అడగాలి. ఇప్పటికే స్టార్టర్లు, మీటర్లు, డోర్లు ఎత్తుకుపోతున్నరు. రేపు ఆడబిడ్డల పుస్తెలతాడు కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకుపోతడని కేటీఆర్ అన్నారు. తన చేతగానితనంతో కేవలం ఒక్క సంవత్సరంలోనే అన్ని రంగాలను రేవంత్ రెడ్డి సావు దెబ్బ కొట్టిండు. ఇది రాష్ట్ర ఆర్థిక లోటు కాదు.. రేవంత్ రెడ్డి వల్ల వచ్చిన తలపోటు అన్నారు. రాష్ట్రంలో కొత్త నిర్మాణాల పైన ఒక్క స్క్వేర్ ఫీట్‌కి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి తెలంగాణ దివాలా తీస్తుందని ఒకటే తీరుగా ప్రచారం చేసిండు. ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ నాశనమైందని చెప్తూ వస్తున్నారు. తన సొంత రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చిందని చెప్పిన దివాళా కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే అని కేటీఆర్ పేర్కొన్నారు.
………………………………….