
* కాపాడేందుకు సర్వశక్తులూ కృషి చేస్తున్నాం : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
* అందుకే ప్రమాదం జరిగింది : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో జరిగిన భారీ ప్రమాదంలో 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. కొంత మంది ప్రాణాలతో బయటపడగా, పలువురి లోపలే ఉండిపో్యారు. వారిని కాపాడేందుకు సర్వశక్తులూ కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uthamkumar reddy) తెలిపారు. ఉదయం 8 గంటలకు కార్మికులు లోపలికి వెళ్లారని, 8.30కు టన్నెల్ బోరింగ్ మిషన్ ను ఆన్ చేశారని వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత 42 మంది కార్మికులు బయటకు సురక్షితంగానే వచ్చినట్లు తెలిపారు. టన్నెల్ (Tunnel)లో ఒకవైపు నుంచి నీరు లీకై మంటి కుంగిందన్నారు. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి.. చాలా మంది కార్మికులను బయటకు పంపించారని వెల్లడించారు. లోపల చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. టన్నెల్ లో యూపీ, ఝార్కెండ్ వాసులు చిక్కుకున్నట్లు వివరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkatreddy) కూడా ప్రమాదంపై స్పందించారు. ”శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటరు ఇన్లేట్ వద్ద (దోమలపెంట దగ్గర) సీపేజ్ను పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ అవడంవల్ల ప్రమాదం జరిగింది” అని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
……………………………………