
* దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahulgandhi) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanthreddy)కి ఫోన్ చేశారు. ఎస్ ఎల్బీసీ ఘటనపై దాదాపు 20 నిమిషాలకు పైగా సీఎంతో రాహుల్ మాట్లాడారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (uthamkumar reddy)ఘటనాస్థలానికి వెళ్లారని, ఎస్డీఆర్ ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు వెళ్లాయని రాహుల్‌కు సీఎం వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరుపై రాహుల్ (Rahul) సంతృప్తి వ్యక్తం చేశారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలని ఆదేశించారు.
……………………………………….