
* ఎందుకీ ప్రస్తావన.. ఆయన ఏం చేశారంటే..
ఆకేరు న్యూస్ డెస్క్ : అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సంతోషం వెలిబుచ్చారు. ప్రతీ నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో తెలంగాణకు చెందిన ఓ ఉపాధ్యాయుడును మోదీ ప్రసంశించడం ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ చంద్రయాన్(Chandrayan) విజయం మనకు ఎంతో గర్వకారణమన్నారు. అంతరిక్ష రంగంపై మన యువత ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారని కొనియాడారు. ఏఐ రంగంలో మనదేశం మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఏఐ (AI) వినియోగించి ఆదిలాబాద్ ఉపాధ్యాయుడు మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. గిరిజన భాష లిపి, సంస్కృతిని కాపాడేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తొలసం కైలాష్(Tholasam Khailash)ను గిరిజన భాషలను పరిరక్షించడంలో తమకు ఆయన సాయం చేశారని మోదీ ప్రశంసించారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేశారని చెప్పుకొచ్చారు.
………………………………..