
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మరికొంత మంది పోలీసు అధికారులను బదిలీ (IPS Transfers) చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి (CS SHanthi Kumari) ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజరావు భూపాల్ ను ట్రాన్స్ఫర్ చేశారు. సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, సీఐడీ ఏడీసీగా రామ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్, గవర్నర్ ఏడీసీ(Governor Adc)గా శ్రీకాంత్ నియమితులయ్యారు. ఇదిలాఉండగా, రోడ్ సేఫ్టీ డీజీగా పనిచేస్తున్న అంజనీకుమార్, రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీ అభిలాష బిస్త్‌ను ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచిస్తూ తెలంగాణలో రిలీవ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
…………………………….