
* వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి
* మృతుల్లో ఐదుగురు తెలంగాణవాళ్లు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉత్తర భారతదేశంలో రోడ్లు నెత్తురోడాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు వేర్వేరు ప్రాంతాల్లో 4 ఘోర ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. బిహార్(BIHAR)లోని పట్నా(PATNA), మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మృతి చెందారు. పట్నా మసౌర్హి రోడ్డులోని నౌరా బ్రిడ్జి సమీపంలో లారీ, ట్రక్కు ఢీకొని ఆటోలోని ఏడుగురు చనిపోయారు. పరస్పరం ఢీ కొని టెంపో, ట్రక్కు బ్రిడ్జి నుంచి కిందపడ్డాయి. మరోవైపు, ప్రయాగ్‌రాజ్ నుంచి తిగొస్తున్న జీపు అతివేగంతో అదుపుతప్పి ఢీకొట్టి రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. రెండు ఘటనల్లోనూ చాలా మంది గాయపడ్డారు.
జహీరాబాద్‌కు చెందిన డీఈ దంపతుల మృతి
ఉత్తరప్రదేశ్ వారణాసి(VARANASI) వద్ద మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణ(TELANGANA)లోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగానే ఈ ప్రమాదం కూడా జరిగింది. వారణాసి వద్ద టిప్పర్ ను కారు ఢీ కొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో తెలంగాణలోని జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి (46), భార్య విలాసిని (40), న్యాల్కల్ మండలం మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. సిద్దిపేట జిల్లా మల్లారం శివారులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హైదరాబాద్ – కరీంనగర్ జాతీయ రహదారిపై నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………..