
* బీఆర్ ఎస్‌లో చేరిన స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ నేతలు
* రైతు ఆత్మహత్యలు, కార్మికులు ఇరుక్కుపోతే రేవంత్‌కు సోయి లేదు
* ఎన్నికల ప్రచారం కోసం గాల్లో చక్కర్లు కొడుతుండు : కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇది రేవంత్ ప్రభుత్వ పతనానికి సంకేతమని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్ (CONGRESS)పార్టీని వదిలిపెట్టి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS)పార్టీలో హస్తం నేతలు, కార్యకర్తలు చేరుతున్నారంటే రేవంత్ ప్రభుత్వం పతనానికి సంకేతం అని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ 35 సార్లు ఢిల్లీ (DELHI)వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వంపై అప్పుడే ప్రజలు విసుగు చెందుతున్నారని, రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోనూ పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారని వెల్లడించారు. గత 48 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకో దిక్కు ఎస్ఎల్బీసీ (SLBC) వద్ద ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు సొరంగంలో ఇరుక్కుపోయారు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఆ ఎన్నికతో గవర్నమెంట్ మారేది లేదు.. ప్రభుత్వం తలకిందులు అయ్యేది లేదు. కానీ దాని కోసం హెలికాప్టర్లో పోయి మాట్లాడుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యలు, కార్మికులు ఇరుక్కుపోతే సోయి లేకుండా గాల్లో చక్కర్లు కొడతున్నాడని రేవంత్‌ను విమర్శించారు.
…………………………………..