
ఆకేరున్యూస్, హైదరాబాద్: చికెన్ గున్యా వ్యాధి నివారణ కోసం బయోలాజికల్-ఈఫార్మా బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. పేద, మధ్య తరగతి ఆదాయం ఉన్న దేశాలకు.. చికెన్ గున్యా వ్యాక్సిన్‌ను అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. బవేరియన్ కంపెనీతో కుదిరిన వ్యూహాత్మక ఒప్పందంపై .. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ కంపెనీ తెలిపింది. ఒప్పందంలో భాగంగా తొలుత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగనున్నది. ఆ తర్వాత వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. దిగువ, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలన్న టార్గెట్‌తో రెండు ఫార్మాల కంపెనీలు డీల్ చేసుకున్నాయి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తర్వాత.. రెగ్యులేటరీ ఆమోదం కోసం కంపెనీ ప్రయత్నించనున్నది. ఆ తర్వాత కమర్షియల్‌గా చికెన్ గున్యా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలోనే వ్యాక్సిన్ తయారీ జరగనున్నది. బయోలాజికల్-ఈ సంస్థ దీని ద్వారా కొత్తగా 300 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నది. చికెన్ గున్యా వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టును చేపట్టినట్లు బీఈ వెల్లడిరచింది. అమెరికాలో చికున్ గునియా వ్యాక్సిన్‌కు ఆమోదం దక్కింది. 12 ఏళ్ల వయసు పిల్లలు కూడా అక్కడ ఆ వ్యాక్సిన్ ఇస్తున్నారు. బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉన్నట్లు బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా ధాట్ల తెలిపారు. దిగువ, మధ్య ఆదాయ దేశాల ప్రజలకు చికెన్ గున్యా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తి విధానం, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు వల్ల.. బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం కుదర్చినట్లు ఆమె తెలిపారు. తమ కంపెనీ వద్ద ఉన్న అడ్వాన్స్డ్, నిష్ణాత తయారీ టెక్నాలజీతో.. పేద దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు ఆమె వెల్లడిరచారు. తమ ప్రయత్నం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చికెన్ గున్యా వ్యాధి నియంత్రణలోకి వస్తుందని, తద్వారా ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలపడుతుందని ఆశిస్తున్నట్లు మహిమ పేర్కొన్నారు. చికెన్ గున్యా వ్యాక్సిన్‌కు గ్లోబల్ యాక్సెస్ దక్కేందుకు.. బీఈతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బవేరియన్ నార్డిక్ కంపెనీ సీఈవో పౌల్ చాప్లిన్ తెలిపారు. చిక్ వీఎల్పీ పేరుతో వ్యాక్సిన్ రూపొందిస్తున్నారు. దీన్నే వీఎల్పీ రికాంబినాంట్ ప్రోటీన్ వ్యాక్సిన్‌గా పిలుస్తారు. చికెన్ గున్యా వైరస్‌ను ఆ ప్రోటీన్ వ్యాక్సిన్ అదుపులోకి తీసుకువస్తుంది. 12 ఏళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇస్తారు.
………………………………………………