
* పంజాబ్ నుంచి నామినేట్ అయ్యే ఛాన్స్
ఆకేరున్యూస్, ఢిల్లీ: ఢిల్లీలో అధికారం కోల్పోవడంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ రాజకీయంగా బలంగా మారేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు పార్లమెంట్‌ను వేదిక చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. మోఢీని ఢీకొనాలంటే పార్లమెంటులో ఉండాలన్న యోచనలో ఉండివుండవచ్చు. ఈ క్రమంలో ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్ ఇక పార్లమెంట్లో అడుగుపెడతారన్న ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఆయనను త్వరలోనే రాజ్యసభకు పంపించేందుకు ఆప్ ముమ్మర సన్నాహాలు చేస్తున్నట్లు కథనాలు వెలువడు తున్నాయి. అయితే, వీటిని పార్టీ తోసిపుచ్చింది.ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న ఆప్ ఎంపీ సంజీవ్ అరోఢాను పార్టీ పంజాబ్ ఉప ఎన్నికల బరిలో నిలబెట్టింది. త్వరలో జరగబోయే లూథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా సంజీవ్ పేరును ఖరారు చేస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో కేజీవ్రాల్ పార్లమెంట్ ప్రవేశంపై వార్తలు గుప్పుమన్నాయి. సంజీవ్ అరోఢా 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028లో ముగియనుంది. కాగా.. లూథియానా వెస్ట్ నుంచి ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగి గత నెల మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో పార్టీ సంజీవ్‌ను బరిలోకి దించింది. ఉప ఎన్నికల్లో ఆయన గెలుపొందే అవకాశాలు ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పదవిలో కొనసాగాలనుకుంటే.. రాజ్యసభ సభ్యత్వాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పెద్దల సభలో ఖాళీ అయ్యే ఆ స్థానానికి కేజీవ్రాల్ను పంపించాలని ఆప్ భావిస్తున్నట్లు పలు ఆంగ్ల విూడియా కథనాలు వెల్లడిరచాయి.అయితే, ఈ ప్రచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిరచింది. అవన్నీ వదంతులేనని ఆప్ పంజాబ్ విభాగ అధికార ప్రతినిధి జగ్తర్ సింగ్ వెల్లడిరచారు. కేజీవ్రాల్ను రాజ్యసభకు పంపించే అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇక, ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పార్టీ అధినేత కేజీవ్రాల్ కూడా ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన న్యూదిల్లీ శాసనసభ నియోజకవర్గం నుంచి భాజపా నేత పర్వేశ్‌వర్మ విజయం సాధించారు. ప్రస్తుతం దిల్లీ అసెంబ్లీలో మాజీ సీఎం ఆతిశీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈక్రమంలో పార్లమెంటులో ఉండడమే శ్రేయస్కరమని కేజ్రీవాల్ భావిస్తున్నారు. లేకుంటే పార్టీని కాపాడుకోవడం కష్టం కావచ్చు.
………………………………………………………..