
* కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్
* తెలంగాణలోని మందమర్రి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
* పోలింగ్ కేంద్రం వద్ బీజేపీ – కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్/అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (MLC ELECTION POLING) కొనసాగుతోంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల స్థానల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఏపీ(AP), తెలంగాణ రాష్ట్రాల్లో మూడు చప్పున 6 స్థానాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. 16 జిల్లాల పరిధిలో 1,062 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా కూటమి, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ ప్రచారం జరిగింది. పోటీ కూడా వీరి మధ్యే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
తెలంగాణ(TELANGANA)లో ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 973 కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మందమర్రి పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ బీజేపీ (BJP)- కాంగ్రెస్(CONGRESS) నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ స్థానంలో కాంగ్రెస్ నేతలు టెంట్ వేశారని బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలను సముదాయించారు.
……………………………………….