
* హెలికాప్టర్ నుంచి చూస్తే సొరంగం కనిపిస్తదా..?
* మంత్రులను ప్రశ్నించిన హరీశ్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దాదాపు ఐదు రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదని.. వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిలైందన్నారు. కేంద్ర ప్రభుత్వ బృందాలు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు, ఏజెన్సీ మధ్య సమన్వయం లోపించిందని.. వీరికి డైరెక్షన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లలో టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు తప్ప, సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా ఫెయిలయ్యారన్నారు. హెలికాప్టర్ పైనుంచి చూస్తే సొరంగం లోపల ఏమన్నా కనిపిస్తాదా, ప్రత్యేకంగా చూడడానికి వీఎక్స్ రే కెమెరాలు ఉన్నాయా? హెలికాప్టర్లలో చెక్కర్లు కొట్టుడు టీవీ ఇంటర్వ్యూలు ఏమిటో నాకు అర్థం కావడం లేదన్నారు. వారి ప్రాణాలు కాపాడటానికి అనేక టీమ్‌లు వచ్చాయని అంటున్నారు, కానీ డైరెక్షన్ ఈ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ అందులో పూర్తిగా ఫెయిలయ్యారని.. మేము సంయమనం పాటిస్తుంటే కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు.
…………………………………….