
* రేవంత్ రెడ్డివి బ్లాక్ మెయిల్ రాజకీయాలు
* కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నేను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు రేవంత్ రెడ్డి నిరూపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి (Kishnreddy) సవాల్ విసిరారు. రేవంత్ ఆరోపణలపై ఆయన స్పందించారు. సీఎంగా ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తి సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అన్నారు. రేవంత్ రెడ్డి (Revanthreddy) బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని హెచ్చరించారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో తాను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకువస్తున్నానని చెప్పారు. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు అయినా తాను అడ్డుకున్నట్లు రుజువు చూపించాలని రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. మెట్రో(Metro)కు సంబంధించి మొన్న ప్రతిపాదనలు పంపారని గుర్తుచేశారు. మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదని.. ఆ నెపం తన మీదకు నెడుతున్నారని మండిపడ్డారు.
……………………………………