
* కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ
* పార్టీలో భిన్నాభిప్రాయాలు ఎక్కవగా ఉంటాయి
* సీఎం రేవంత్ ఆలోచనలను కిందిస్థాయికి తీసుకెళ్తాం : మీనాక్షి నటరాజన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కోసం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ (MEENAKSHI NATARAJAN) హైదరాబాద్కు విచ్చేశారు. దిల్కుశ గెస్ట్ హౌస్లో ఆమెను సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTHREDDY), ఇతర ప్రముఖులు కలిశారు. రేవంత్ వెంట టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్(MAHESH GOUD), మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరి అభిప్రాయాలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఖర్గే, రాహుల్ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పారు. తమ పార్టీలో అంతర్గత కలహాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ(CONGRESS PARTY)లో ప్రజాస్వామ్యం ఎక్కువ అనిత తెలిపారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఎక్కవగా ఉంటాయని, ప్రతి ఒక్కరి ఆలోచనలూ ఒకేలా ఉండవని వివరంచారు. రాజ్యాంగ విలువలతో కూడిన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా మారాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రేరణగా తీసుకుని సామాజిక, ఆర్థిక న్యాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను కిందిస్థాయి వరకూ తీసుకెళ్తామని తెలిపారు.
………………………………