
* మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli KrishnaRao) ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసమే హరీశ్‌రావు (Harishrao)మాట్లాడుతున్నారని విమర్శించారు. టన్నెల్ ప్రమాదంపై బీఆర్ ఎస్ చేస్తున్న విమర్శలపై ఆయన హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఘటనాస్థలికి వెళ్లలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.. బీఆర్ ఎస్ హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కేసీఆర్ (Kcr) వెళ్లారా అని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులను కూడా బీఆర్ ఎస్ నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లలో 200 కిలోమీటర్లు టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేశామని హరీశ్‌రావు అంటున్నారని, ఎస్ ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. ఎకరాలకు రూ. లక్ష ఖర్చయ్యే టన్నెల్ (Tunnel)ను పూర్తి చేయకుండా, రూ.3 లక్షలయ్యే కాళేశ్వరం(Kaleswaram) పనులు ఎందుకు చేపట్టారన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్‌కు పేరొస్తుందని బీఆర్ ఎస్ అక్కసు వెళ్లగక్కుతోందన్నారు.
……………………………………………