
* హరీశ్‌రావు రాజీనామా సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(Revanthreddy)కి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ హయాంలో ఎస్ ఎల్బీసీ పనులు జరగలేదని నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని చెప్పారు. లేదంటే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఎస్ ఎల్బీసీ విషయంలో రేవంత్ కు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) విమర్శించారు. 10 రోజులైనా గల్లంతయినవారి ఆచూకీ కనిపెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అన్ని విషయాలనూ ఎండగడతామని హెచ్చరించారు.
……………………………..