
* క్యాడవర్ డాగ్స్ బృందం సైతం..
* 14 రోజులైనా తెలియని 8 మంది ఆచూకీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC TUNNEL) 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆ 8 మంది జాడ కనిపించలేదు. ఇప్పుడు తాజాగా రోబోటిక్ బృందాలు టన్నెల్లోకి ప్రవేశించాయి. రోబోటిక్ (ROBOTIC) నిపుణులతో ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఉన్నారు. టన్నెల్ పరిస్థితిని నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్యాడవర్ డాగ్స్ (CADAVER DOGS) బృందం సైతం టన్నెల్లోకి వెళ్లింది. తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకోమోటర్ తీసుకువెళ్లగా, సామగ్రితో పాటు 110 మంది సిబ్బంది లోపలికి వెళ్లారు. 15 ఫీట్ల లోపల ఉన్నా క్యాడవర్ డాగ్స్ గుర్తించడం ప్రత్యేకత. అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం టన్నెల్ నుంచి తిరిగి వెనక్కి రానుంది. సంఘటనా స్థలిలో పరిస్థితులను నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.
……………………………………