
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు బదిలీలు అయ్యారు. అదనపు డీజీ(పర్సనల్)గా అనిల్ కుమార్, ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐడీ ఐజీగా ఎం. శ్రీనివాసులు, రామగుండం సీపీగా అంబర్ కిశోర్ రaా, వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, మహిళా భద్రత విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్, కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర, నిజామాబాద్ సీపీగా సాయిచైతన్య, సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్, కరీంనగర్ ఎస్పీగా గౌస్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్, యాదాద్రి భువనగిరి డీసీపీగా ఆక్షాన్స్ యాదవ్, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా మహేశ్ బాబాసాహెబ్, మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్, సూర్యాపేట ఎస్పీగా నరసింహ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, ఎస్ఐబీ ఇంటెలిజెన్స్ ఎస్పీగా సాయి శేఖర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సీఐడీ ఎస్పీగా రవీందర్ బదిలీ అయ్యారు.
……………………………….