
* ఏప్రిల్ 27న జరిగే వేడుకలపై ప్రత్యేక సమావేశం
* పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఏప్రిల్ 27న జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రెవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి కేటీఆర్, హరీశ్‌రావు, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, కేఆర్ సురేశ్, బండా ప్రకాశ్, సబితా ఇంద్రారెడ్డి, కవిత, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వినోద్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేశపతి శ్రీనివాస్, శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
…………………………………..