
సీఎం పదవి అలా వచ్చిందే..
* ఢిల్లీ సీఎం రేఖాగుప్తా
ఆకేరున్యూస్, ఢిల్లీ: బిజెపిలో మహిళలకు సముచిత గౌరవం ఉంటుందని, సిఎం పదవి తనకు అలా వచ్చిందేనన ఢిల్లీ సిఎం రేఖాగుప్తా అన్నారు. అందుకు తానెంతో గర్విస్తున్నానని అన్నారు. అనుభవం లేకపోయినా ఒకేసారి ఉన్నత పదవిని చేపట్టడం ఎలా ఉందని దిల్లీ సీఎం రేఖా గుప్తా కు ప్రశ్న ఎదురైంది. ఓ జాతీయవిూడియా సంస్థతో మాట్లాడుతూ దానికి ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఉర్దూ కవి రహత్ ఇందోరి రాసిన షాయరీని ప్రస్తావించారు. ‘నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకును కాను.. ఎవరైనా ఆ తుపానుకు కాస్త చెప్పండి.. అదుపులో ఉండమని‘ అంటూ బదులిచ్చారు. ‘ముఖ్యమంత్రిని కావడం నా కల కాదు. నా దారిలో నేను పని చేసుకుంటూ ముందుకెళ్లాను. ఈ పదవి లాటరీ కాదు. మన దేశంలో మహిళలపై ఉన్న గౌరవానికి ఇది చిహ్నం. మహిళలకు గుర్తింపు ఇవ్వాలనే సిద్దాంతంతో సీఎంగా నన్ను నియమించినందుకు ప్రధాని మోదీ, పార్టీ నేతలకు కృతజ్ఞతలు. ఈ నిర్ణయం దేశ మహిళలకు మంచి సందేశాన్ని ఇస్తుంది‘ అని గుప్తా వెల్లడిరచారు. గత ప్రభుత్వాల పాలనలోని లోపాలను సరిదిద్దేందుకు, అవినీతిని పారదోలేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో రేఖా గుప్తా దిల్లీ సీఎంగా నియమితులయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ఈ అవకాశం దక్కింది. సీఎంగా ఎన్నికైన వెంటనే ఆప్ విమర్శలు చేయడంతో ఆమె దీటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. భాజపా ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదంటూ దిల్లీ మాజీ సీఎం ఆతిశీ చేసిన విమర్శలను రేఖా గుప్తా తిప్పికొట్టారు. ‘కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు దిల్లీని పాలించాయి. ఇన్నేళ్లపాటు విూరేం చేశారో చూసుకోకుండా.. అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కానీ మాపై విమర్శలు చేస్తారా..?‘ అని దీటుగా బదులిచ్చారు.
…………………………………………….