
* హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఆకేరున్యూస్, హనుమకొండ : ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులలో వాటికి పేమెంట్ జరిగి ప్రక్రియ పూర్తయ్యే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ల ప్రక్రియ పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి లతో కలిసి మున్సిపల్, కుడా, జిల్లా పంచాయతీ, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్, కుడా, జిల్లా పంచాయతీ శాఖల లో ఇప్పటి వరకూ పెండిరగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండిరగ్ కారణాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు ఎన్ని బృందాలను ఏర్పాటు చేశారని, దరఖాస్తుల పరిశీలనలో ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని వార్డు కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు. హెల్ప్ డెస్క్ ల ద్వారా ఎల్ఆర్ఎస్ పేమెంట్ పై ప్రచారం జరగాలన్నారు. కుడా పరిధిలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఎంపీవోలు చర్యలు చేపట్టాలని, పేమెంట్ జరిగిన రెండు రోజుల్లో ఎల్ -1 దశ నుండి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండిరగ్ లో లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లాలో తాగునీటి సరఫరాపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా లోని గ్రామాలు, ఆవాసాలు సరిపోను తాగునీరు అందుతుందా అని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్, పరకాల మున్సిపల్ తో పాటు గ్రామాలు ఆవాసాల్లో తాగునీరు సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ఈ వేసవిలో రానున్న రెండు మూడు నెలల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన ప్రణాళికలతో నీటి సరఫరా చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ మల్లేశం, కుడా పిఓ అజిత్ రెడ్డి, సిపిఓ రవీందర్ రడేకర్, డీఎల్పిఓ గంగ భవాని, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
……………………………………………