
* మహిళా బస్సులు ప్రారంభం
* ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహిళా సాధికారత దిశగా తెలంగాణ సర్కార్ (Telangana Government) అడుగులు వేస్తోంది. కోటి మంది మహిళామణులను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ పథకాలు ప్రారంభిస్తున్నారు. ఇందులోభాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి8న ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనున్నారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి.. ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు. పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ అమలు చేయనుంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డిఏ ప్రకటించింది. 2.5 శాతం డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్నిమహిళలు ఉచితంగా వినియోగించుకున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తరువాత ప్రతి రోజూ దాదాపు 14 లక్షల మంది మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. అయినా సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
……………………………………….