
* మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
ఆకేరున్యూస్, హన్మకొండ: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్లో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం శాలువాతో సన్మానించారు. బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళా సాధికారతకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మహిళల రక్షణకు ప్రతీ ఒక్కరూ కంకణబద్దులు కావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఓట్లు దండుకొని … వారిని మోసం చేసిందని అన్నారు. ప్రతినెల మహిళలకు 2500 ఇస్తానన్నారు… ఏడాదిన్నర అయింది 2500 ఏవి అని మహిళలు ఎదురు చూస్తున్నారని అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు ఏవీ అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇమ్మడి లోహితా రాజు, నాయకులు పులి రజినీకాంత్, కొండపాక రఘు, స్నేహిత్, రఘు తదితరులు పాల్గొన్నారు.
……………………………………….