
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జనగాంఛ గోత్తి కోయగూడెం చెందిన మహిళ కళేబరం 8 నెలల అనంతరం లభ్యమైంది. స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఫారెస్ట్ అధికారుల బృందం విధి నిర్వహణలో భాగంగా జలగలంచ సమీపంలోని దుర్గం గుట్ట వెల్లగా అక్కడ ఒక మహిళ మృతదేహం అస్థిపంజరం కనపడడంతో ఈ సమాచారం పోలీసులకు అందజేశారని తెలిపారు. దీనిపై స్పందించిన పోలీస్ అధికారుల బృందం గుర్తుతెలియని మహిళ ఎవరనేది విచారించగా జలగలంఛ గోత్తి గూడెం చెందిన మడకం ఇడుమయ్య కూతురు మడకం అడిమి అని తెలిసందని.. ఆమే ఎలా చనిపోయిందని విచారించగా మృతురాలు 2024 జులై 11న ఇంట్లో గొడవ పెట్టుకుని ఉదయం ఆరు గంటలకు పుట్టగొడుగులకని అడవికి వెళ్ళి తిరిగి రాలేదు. ఆ గుత్తి కోయ గుంపు వాళ్లు చుట్టుపక్కల వెతికినా కూడా ఆచూకీ తెలియలేదు. అంతకుముందు కూడా ఇలాగే గొడవ జరిగినప్పుడు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఉండి, ఇంటికి తిరిగి వచ్చేది. ఇంతకుముందు రెండు మూడు సార్లు ఇలా జరిగిందని తెలిసినది. ఇప్పుడు కూడా అలానే వెళ్లిందనుకొని గూడెం వాసులు తెలిపారు. ఆ సమయంలో పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం దుర్గం గుట్టపై గల మృతదేహ కళేబరం ఆమె మృతుదేహమేనని గ్రామస్తులు మృతురాలు తండ్రి గుర్తించారు. శనివారం మృతురాలి తండ్రి మడకం ఇడమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
………………………………