
* రెడ్ నోటీసులు అందజేసినా స్పందించని షాప్ యజమానులు
ఆకేరున్యూస్, వరంగల్: సుదీర్ఘకాలం పనులు చెల్లించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న రెండు దుకాణాలను సీజ్ చేసినట్లు కాశీబుగ్గ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి తెలిపారు.ఈ సందర్భంగా డిసి మాట్లాడుతూ వరంగల్ గోపాల స్వామి గుడి సమీపంలో ఉన్న దుకాణం పాపయ్య పేట చమాన్ ప్రాంతం లో ఉన్న మరో దుకాణదారులు చాలాకాలం నుండి పన్నులు చెల్లించాలని కోరడం జరిగిందని చెల్లించని తరుణంలో నోటీసు లు కుడా అందించామని అయినను స్పందన లేకపోవడంతో రెడ్ నోటీసు కూడా ఇచ్చామని అయినను పన్నులు చెల్లించక పోవడం తో కమిషనర్ ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరిగిందని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ షేహజాది బేగం ఆర్ఐ విజయ్ కుమార్ వార్డు ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
………………………………….