
* అభ్యర్థుల వెంట సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు (Congress Mlc Candidates) నామినేషన్లు దాఖలు చేశారు. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్లు (Nominations) దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు ఎంఐఎం మద్దతు తెలిపింది. ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్ ఎస్ నుంచి ఒక్కరే పోటీలో ఉండడంతో దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ (Dasoju Sravan) నామినేషన్ దాఖలు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
……………………………………..