
* ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం
* అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు
ఆకేరున్యూస్, హైదరాబాద్: బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటికే అధికారులతో స్పీకర్ ప్రసాదరావు సవిూక్షించి పలు సూచనలు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.. తొలిరోజు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. 14న హోలీ సెలవు కారణంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 15న గవర్నర్ ప్రసంగానికి సిఎం రేవంత్ సమాధానం ఇస్తారు. ఎస్సీ వర్గీకరణ, బిసి బిల్లులతో పాటు పలు అంశాలు చర్చకు రానున్నాయి. కేసీఆర్ తొలిరోజు హాజరవుతారని ఇప్పటికే కేటీఆర్ సమాచారం ఇచ్చారు. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు.
……………………………….