
– ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : మహిళా సంఘాలను బలోపేతం చేసి, మహిళల అభివృద్ధికి పాటుపడుతూ మహిళలందరినీ కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వము కంకణం కట్టుకుందని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని శంభునిపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీవో గుండె బాబు హాజరై మాట్లాడారు.మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటూ ,విద్యా, వైద్యము ,ఉద్యోగం ఇలా పలు రంగాలలో మహిళలు పురుషులకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి మాట్లాడుతూ..రాబోయే చట్టసభలో 33% రిజర్వేషన్ అమలవుతున్నందుకు మహిళలు సంతోషించాలన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు, మహిళా ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్సల్టెంట్ రాజేంద్ర, పంచాయతీ కార్యదర్శి వినీల్ రెడ్డి, మహిళా ఉద్యోగులు, గ్రామైక్య సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….