
ఆకేరున్యూస్, వరంగల్: ఎల్లం బజారుకు చెందిన ఓ వ్యక్తి వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.. ఆ యువకుడు రెండు అంతస్తుల భవనం పైకి చేరుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మట్టేవాడ పోలీసులు ఆ వ్యక్తిని కాపాడారు .వివరాల్లోకి వెళితే.. వరంగల్ పట్టణంలోని ఎల్లం బజార్ కు చెందిన కట్టుకోజు శివకుమార్ అనే వ్యాపారి ఎల్లం బజార్ లోని ఆదర్శ వీధి గల మహబూబ పంచతన్ కాలేజీ ఎదురుగా ఉన్న రెండంతస్తుల బిల్డింగ్ పైకి వ్యక్తిగత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. స్థానికులు వెంటనే డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకుని కాపాడారు. పోలీసులు ఫైర్ సిబ్బంది స్పందించిన తీరును పలువురు ప్రశంసించారు.
………………………………………..