
* స్పీకర్‌తో అధికార, విపక్ష సభ్యులు వేర్వేరుగా సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Speaker Gaddam Prasadkumar)తో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్‌బాబు కూడా సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు అధికార, విపక్ష సభ్యుల గందరగోళంతో శాసనసభ వాయిదా పడింది. సభా సంప్రదాయాలను పాటించాలని సభ్యులకు స్పీకర్ సూచించారు. సభా సంప్రదాయాలకు ఏది విరుద్ధమో చెప్పాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadeeshreddy) ప్రశ్నించారు. స్పీకర్ అధికారాలు ఏంటో తేల్చాలని ఏకవచనంతో సంభోదించారు. సభ స్పీకర్ సొంతమేమీ కాదని అన్నారు. జగదీష్ వ్యాఖ్యలతో కాంగ్రెస్-బీఆర్ ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. జగదీష్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాగా, మంత్రులు కూడా స్పీకర్‌తో సమావేశం అయ్యారు. సభలో జరిగిన అంశాలపై స్పీకర్‌తో చర్చించారు. జగదీష్‌రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా స్పీకర్‌ను జగదీష్‌రెడ్డి విమర్శించలేదని, సభ మీ ఒక్కరిది కాదు, అందరిదీ అని అన్నారని హరీశ్‌రావు (Harishrao) తెలిపారు. మీ అనే పదం సభ నియమాలకు విరుద్ధం కాదన్నారు.
……………………………………..