
* ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ఆకేరున్యూస్, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి మతి భ్రమించిందని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్ట్రెచర్ మీద ఉన్నది కేసీఆర్ కాదు, నువ్వు.. అవును ముమ్మాటికీ ‘నువ్వే’ అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆర్ఎస్పీ అన్నారు. తన వినూత్న ఆలోచనాయుధాలతో తెలంగాణ సమాజానికి విముక్తి కల్పించి, మరో ప్రపంచం వైపు పరుగులు పెట్టించిన ఆ పోరాట యోధున్ని ఎదుర్కోలేక, కేవలం శాపనార్థాలు అనే స్ట్రెచర్ మీద తెలంగాణ లో తచ్చాడుతున్నది నువ్వు అని రేవంత్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రజలు ఇచ్చిన అరుదైన అవకాశాన్ని వారికోసం వినియోగించే ఇంగింత జ్ఞానం కూడా లేని అజ్ఞానివి నువ్వు. నీ లాంటి వారిని ఉంచాల్సింది సచివాలయం, శాసనసభల్లో కాదు, సైకోలుగా మారిన మనుషులను మార్చే మానసిక చికిత్సాలయాల్లో. కేసీఆర్‌కు మీకు పోలికే లేదు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ.. నీ లాగా మార్చురీల భాష మాట్లాడే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. కేసీఆర్ కూడా వాటిని ఎంకరేజ్ చేయరని నాకు మెల్లమెల్లగా అర్థమైతున్నది. నేను స్వయంగా చూసిన ఒక విషయం మీకు చెబుతా వినండి. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన చాలా పార్టీ సమావేశాల్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చింది. ఏ రోజు కూడా ఆయన మీ పేరు ఎత్తి, మీ ప్రస్తావన కూడా తేలేదు. వారి ప్రసంగాలన్నీ ఆద్యంతం తెలంగాణ ప్రజల అమాయకత్వం, ఆవేదన, వారి భవిష్యత్తు, ఇంకా అసంపూర్తిగా ఉన్న ఎన్నో కలలు, బీజేపీ-కాంగ్రెస్ విధానాల వల్ల తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో జరుగుతున్న నష్టం, బీఆర్ఎస్ పార్టీ పాటించాల్సిన వ్యూహం, ప్రజలకోసం చేయాల్సిన పోరాటం చుట్టే తిరిగేవి అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. కొంత మంది పార్టీ సీనియర్ సభ్యులు రాష్ట్రం అసమర్థుల చేతుల్లో పడ్డది అని అన్నపుడు, కేసీఆర్ వారిని వారించి ‘‘అలా మాట్లాడటం సరి కాదు, ప్రజాస్వామ్యం లో రేవంత్ రెడ్డితో సహా ఎవరికైనా ముఖ్యమంత్రి అయ్యే హక్కుంది, ప్రజల తీర్పును హుందాగా గౌరవించాలి, నిరంతరం వాళ్లను ఎడ్యుకేట్ చేయడమే మనం చేయాల్సిన పని’’ అని వారు చెప్పడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. రోజూ మీరు మీ యాంటీరూంలోకి ఒంటరిగా వెళ్లి అద్దం ముందు నిలబడి గట్టిగా మీ ప్రతిబింబంతో మీ సిగ్నేచర్ మార్చురీ భాష మాట్లాడండి. మీ ప్రతిబింబం నిజంగా నిజాయితీగా ఒప్పుకుంటే అదే భాష ముందు మీ కుటుంబంలో వాడండి.. మారండి లేదా ఆసుపత్రిలో చేరండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
………………………..