
* మండల వ్యాప్తంగా 16 విద్యార్థులు ఎంపిక
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇన్స్పైర్ మనక్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) ద్వారా సైన్స్, టెక్నాలజీలో పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి జాతీయస్థాయిలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ 2024- 25 విద్యా సంవత్సరంలో ఎంపికైన విద్యార్థుల లిస్టులను ఇటీవల విడుదల చేసింది. కమలాపూర్ లోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల,జడ్పిహెచ్ఎస్ బాలుర,మోడల్ స్కూల్ ,కేజీబీవీ పాఠశాల,ఉప్పల్లోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల,బాలుర పాఠశాల ఉప్పల్ ,అంబాల లోని జడ్పిహెచ్ఎస్ , సాకేత హై స్కూల్ నుంచి ఇద్దరు చొప్పున విద్యార్థులు ఎంపిక అయ్యారు. మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు సైన్స్ ఎక్సిబిట్ తయారీకి, ప్రదర్శనకు గాను 10వేల రూపాయలు విద్యార్థుల అకౌంట్లో జమ అవుతాయి. విద్యార్థుల ఎంపిక పట్ల ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇన్స్పైర్ మనక్ లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3311 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
……………………………………..