
* ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల కాలంలో బెట్టింగ్, సైబర్ నేరాలపై తనదైన శైలిలో పరిష్కారం చూపుతున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. కొంద మంది యూట్యూబర్లు, ఇన్ఫూయేన్సర్లు.. అమాయ యువకులను బెట్టింగ్ యాప్ల వైపు మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి సోషల్ మీడియా వేదికగనే సజ్జనార్ బుద్ధి చెబుతున్నారు. ఎవరైతే యువకులను టార్గెట్ చేసుకొని బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆయన తెలుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగుతున్న పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు తగిన బుద్ధి చెబుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పడుగపూట ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారికి రంగు పడుద్దని తన ట్వీట్లో తెలిపారు. అలాగే యువతను ప్రశ్నిస్తూ.. మీలో ఎంతమంది బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే నకిలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నివేదించారు. వారిని ఎంతమంది బ్లాక్ చేశారని యూజర్లను తన ట్వీట్ లో ప్రశ్నించారు. కాగా కొద్ది రోజుల క్రితం సజ్జనార్ ట్వీట్ పై స్పందించిన వైజాగ్ పోలీసులు లోకల్ బాయ్ నాని ని అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు కోర్టు తీర్పుతో 14 రోజుల రిమాండ్ కు తరలించారు. అలాగే తెలంగాణ ఫేమస్ బ్లాగర్ అయిన భయ్యా సన్నీ యాదవ్పై కూడా సూర్యాపేట జిల్లా నూతనకల్ లో కేసు నమోదైంది. అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని జిల్లా డీఎస్సీ రవి గురువారం మీడియాతో స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్య్లూటన్సర్లు అందరూ అప్రమత్తమై తమ తమ ఖాతాల్లో ఇప్పటికే పోస్ట్ చేసిన అన్ని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో దేశవ్యాప్తంగా బెట్టింగులు మరోసారి ఊపందుకొనుంది. దీనికి ఊతం ఇచ్చేలా పలువురు మ్యాచ్ ప్రెడిక్షన్ పేరు మీద యువకులను టార్గెట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. అలాంటి వారిపై కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ కన్నెయ్యాలని నెటిజన్లు కోరుతున్నారు.
……………………………………………