
* రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబురాలు
* ప్రజలందరికీ సీఎం రేవంత్ శుభాకాంక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబురాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ పిల్లాపెద్దలు కేరింతలు కొట్టారు. జిల్లాలోనూ రంగుల పండుగ సంబరాలు జోరుగా సాగాయి. వరంగల్(Warangal), మహబూబ్నగర్, సంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad)లోని పీపుల్స్ ప్లాజా, బేగంబజార్, నెక్లెస్ రోడ్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, రోడ్లపై వెళ్లేవారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
సప్తవర్ణ శోభితం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) రాష్ట్ర ప్రజలకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. “సప్తవర్ణ శోభితం.. సకల జనుల సంబురం.. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు” అంటూ సీఎం ట్వీట్ చేశారు. అలాగే ఈ రంగుల పండుగను అందరూ వైభవోపేతంగా జరుపుకోవాలని అన్నారు. ఈ పండుగ అందరీ కుటుంబాల్లో ఆనందాలు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
……………………………………..