
* వరంగల్ జిల్లా ఊరచెరువులో ఘటన
ఆకేరు న్యూస్, వరంగల్ : హోలీ రోజున చేపలు పడదామని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో వల వేసి చేపల కోసం చూస్తున్నారు. వలకు ఏదో చిక్కినట్లు అనిపించింది. లాగుతుంటే బరువుగా ఉంది.. అబ్బో.. ఏదో పెద్ద చేపే చిక్కి ఉంటుందని వలను పైకి గుంజారు. అందులో చేపలకు బదులు కొండ చిలువ ఉండటంతో చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి (Warangal District Rayaparthi) మండలంలోని కొండాపురంలో చోటుచేసుకున్నది. హోలీ పండుగ సందర్భంగా మత్స్యకారులు గ్రామంలోని ఊర చెరువులో చేపల కోసం వలలు వేశారు. ఈ క్రమంలో జాలర్ల వలలో కొండచిలువ పడింది. ఈ విషయం దావనంలా వ్యాపించడంతో కొండచిలువను చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు.
………………………………